జగన్ కు సుప్రీం షాక్
1 min readఢిల్లీ: అమరావతి భూముల విషయంలో జగన్ కు సుప్రీం షాక్ ఇచ్చింది. భూముల విషయంలో గతంలో జస్టిస్ ఎన్వీ రమణ మీద జగన్ సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద అంతర్గత విచారణ జరిపిన సుప్రీం కోర్టు జగన్ ఫిర్యాదును తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. 2020 అక్టోబర్ 6న జగన్ .. జస్టిస్ ఎన్వీ రమణ మీద సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇన్ హౌస్ విచారణ జరిపినట్టు తెలుస్తోంది. ఇది పూర్తిగా అంతర్గత విషయం కావడంతో.. ఇందుకు సంబంధించిన పూర్తీ సమాచారం బయటకురాలేదు. సుప్రీం కోర్టు తదుపరి ఛీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఎన్వీ రమణను .. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ప్రతిపాదించిన రోజే.. ఈ కేసును సుప్రీం కోర్టు తోసిపుచ్చడం గమనార్హం. అయితే.. రాష్ట్రపతి ఆమోదం అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.