సురేంద్ర మరణం మీడియా రంగానికి తీరని లోటు
1 min readజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఏబీఎన్ ఛానల్ వీడియో గ్రాఫర్ సురేంద్ర (చిన్న) మరణం పత్రికా రంగానికి మరియు ముఖ్యంగా మీడియా లోకానికి తీరని లోటని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మాజీ సభ్యులు పి మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. మంగళవారం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన సురేంద్ర భౌతిక కాయాన్ని సందర్శించి పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేసి మంచి మిత్రుని కోల్పోయామని అతని ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ.. సురేంద్ర, భార్య, పిల్లలు, కుటుంబానికి దేవుని అండ, ఉండాలని చిన్న వయసులోనే ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారని అన్నా అంటూ చిరునవ్వుతో పలకరించే సురేంద్ర నేడు లేడనే, వార్త నమ్మశక్యం కావడం లేదని దేవుడు మంచి వాళ్లను, కష్టపడే వాళ్లను తన దగ్గరికి తొందరగా తీసుకెళ్తారని ఎందుకో ఇది ఎవరికి అర్థం కావడం లేదని జీవితం ఇంత సున్నితమైనదని సురేంద్ర నేడు లేడనే ,వార్తను జీర్ణించుకోలేక పోతున్నామని అభిప్రాయపడ్డారు.