స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో సర్జరీ సేవలు ప్రారంభం
1 min read
ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ..
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో సర్జరీ సేవలు ప్రారంభించడం జరిగిందని అన్నారు. తద్వారా రాష్ట్రంలో అధునాతమైన క్యాన్సర్ చికిత్స కర్నూలు లో అందబోతుందన్నారు.ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తోందన్నారు… సర్జికల్ ఆంకాలజీ, జనరల్ ఆంకాలజీ లలో సర్జరీలను వైద్యులు చేయనున్నట్లు తెలిపారు.అత్యాధునిక పద్ధతిలో వైద్యులు అనేక సర్జరీలు చేశారన్నారు..వార్డులను పరిశీలించి వైద్యులు అందిస్తున్న సేవలపట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేశారు.రాష్ట్రంలోనే గర్వించదగ్గ కర్నూలు ఆస్పత్రిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమానికి స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, డా.ప్రకాష్, సి ఎస్ ఆర్ ఎం ఓ, డా.వెంకటేశ్వరరావు, అనస్థీషియా హెచ్వైడి, డా.విశాల, అనస్థీషియా ప్రొఫెసర్, డా.రామ్ శివ నాయక్, సి ఎస్ ఆర్ ఎం ఓ, డా.హేమనలిని, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, డా.కిరణ్ కుమార్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనస్థీషియా అసోసియేట్ ప్రొఫెసర్, డా.భారతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.కాంచన, తదితరులు పాల్గొన్నారు.