NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్త‌మ న‌టులుగా సూర్య‌, అజ‌య్ దేవ‌గ‌ణ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: 68వ జాతీయ పురస్కార ప్రదానోత్సవం దేశ రాజధాని ఢిల్లీలోని విఘ్నయన్‌ భవన్‌లో వైభవంగా జరిగింది. భారతీ చలన చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన నటీనటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరిగింది. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జి.ఆర్‌.గోపినాథ్‌ జీవిత కథను ఆధారంగా సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన ‘సూరరై పోట్రు’ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో హీరోగా నటించిన సూర్య ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాలు వరించాయి. హిందీ చిత్రం ‘తాన్హాజీ’లో టైటిల్‌ పాత్ర పోషించిన అజయ్‌ దేవగణ్‌, ‘సూరరై పోట్రు’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా సూర్య అవార్డును అందుకున్నారు.

                                                 

About Author