కర్నూలు జీజీహెచ్ లో ఒపి విభాగాల ఆకస్మిక తనిఖీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ.. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పలు ఒపి విభాగాలలైన క్యాజువాలిటీ, సైకియాట్రి, డెంటల్, మెడికల్ ఒపి, సర్జికల్,డెర్మటాలజీ, ఇఎన్టి, తదితర ఒపి విభాగాలకు ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలిపారు.ఎమర్జెన్సీ విభాగంలో తనిఖీ సమయంలో విధి నిర్వహణ లేని అసిస్టెంట్ ప్రొఫెసర్లపై అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మరియు జనరల్ సర్జరీ, విభాగపు అసిస్టెంట్, ప్రొఫెసర్ మెమో ఇష్యూ చేసినట్లు తెలిపారు.ఎమర్జెన్సీ విభాగాలకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఆదేశించినట్లు తెలిపారు.ఆస్పత్రి పలు ఓపి విభాగాలలో ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ పనితీరు గురించి ఆరా తీశారు అనంతరం ఈ హాస్పిటల్ ఎంట్రీస్ ప్రాపర్ గా అయ్యేటట్లు చూసుకొని ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా అమలు అయ్యేటట్టు చూసుకోవాలని సంబంధించిన హెచ్ ఓ డి లకు ఆదేశించినట్లు తెలిపారు.ఆసుపత్రి ఆవరణ లోని పేషంట్ల రద్దీ దృష్ట్యా అదనంగా మరొక ఒక ఓపి కౌంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమానికి హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.