NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొరియ‌ర్ సెంట‌ర్ల పై నిఘా.. డ్రగ్స్ దందాకు బ్రేక్ ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డ్రగ్స్ ర‌వాణ అరిక‌ట్టడం పోలీసుల‌కు పెద్ద స‌వాల్ గా మారింది. యువ‌త‌ను మ‌త్తులో ఉంచి కోట్లు కొల్లగొడుతున్న మాఫియా ఆటక‌ట్టించేందుకు పోలీసులు ప్రతివ్యూహం ప‌న్నుతున్నారు. కీల‌క‌మైన డ్రగ్స్ ర‌వాణ మార్గాల‌కు చెక్ పెట్టడం ద్వార మాఫియాకు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని పోలీసులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా కొరియ‌ర్ సెంటర్లపై నిఘా పెంచారు. బెంగ‌ళూరు న‌గ‌రానికి వివిధ ప్రాంతాల నుంచి కొరియ‌ర్ సెంటర్ల ద్వార డ్రగ్స్ స‌ర‌ఫ‌రా అవుతున్నాయ‌న్న స‌మాచారంతో పోలీసులు సెర్చ్ నిర్వహించారు. కీల‌క‌మైన కొరియ‌ర్ సెంట‌ర్ల వ‌ద్ద డాగ్ స్క్వాడ్ ద్వార పరిశీలిస్తున్నారు. 12 ద‌ళాల డాగ్ స్క్వాడ్ బృందాలు ప‌లు కొరియ‌ర్ సెంట‌ర్ల వ‌ద్ద త‌నిఖీలు చేశారు. బెంగ‌ళూరు సెంట్రల్ డీసిపీ అనుచేత‌న్ నేతృత్వంలో ఈ సెర్చ్ జ‌రిగింది.

About Author