ఇంటింటికీ ఆరోగ్య సేవలపై సర్వే వేగవంతం..
1 min read– ప్రతి ఇంటి నుండి క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : భీమడోలు ఆగడాలలంకలో ఇంటింటికీ అందు తున్న ఆరోగ్య సేవలపై మూడు రోజులుగా నిర్వహి స్తున్న జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 8 మంది సభ్యుల కేంద్ర బృందం గుండుగొలను పీహెచ్సీ పరిధిలోని ఆగడాలలంకలో పర్యటించి ఈ సర్వే నిర్వహించారు. వివిధ ఆరోగ్య సేవలు ప్రజలకు ఏ స్థాయిలో అందుతున్నాయనే వివరాలు నమోదు చేసుకున్నారు. సర్వేలో సేకరిం చిన సమాచారం మేరకు ఆరోగ్య సేవలను నమోదు చేసుకున్నారు. ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి చిన్నారులకు టీకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. తల్లిదండ్రులకు టీకాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. పథకాలు పారదర్శకంగా, సక్రమం గా అందుతున్నదీ లేనిదీ లబ్ధిదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, ఐదేళ్ల లోపు పిల్లల తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. వాటిన్నింటిని నివేదిక రూపంలో తయారీ చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని బృందం సభ్యులు పేర్కొన్నారు. నోడల్ అధికారుల బృందం సాగర్, కృష్ణారావు, మల్లేశ్వరీ, సుబ్బలక్ష్మి, బేగ్, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు రాజు మరియు తదితరులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.