NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సూర్య బర్త్‌డే స్పెషల్‌

1 min read

సినిమా డెస్క్​ : కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా బోలెడంతమంది ఫ్యాన్స్‌ ఉన్నారు సూర్యకు. తన బర్త్ డే సందర్భంగా తన సినిమాల లిస్ట్‌ ప్రకటిస్తున్నారు మేకర్స్‌. అందులో భాగంగా నిన్న తన నలభయ్యవ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ పాండిరాజ్ దర్శకత్వంలో రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ‘ఎదర్కుమ్ తునిందవన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘దేన్నయినా ఎదుర్కొనే ధీరుడు’ అని దీనర్థం. దానికి తగ్గట్టే సూర్యా కూడా ఓ పెద్ద కత్తి పట్టుకుని తనకెదురొచ్చిన వాళ్లని నరుకుతున్న పవర్‌‌ ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో ఉన్న వీడియో గ్లిమ్స్‌ని రిలీజ్‌ చేశారు. సూర్య యాక్షన్‌ సీన్స్‌ చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘శ్రీకారం’ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సత్యరాజ్, శరణ్య, పొన్ వన్నన్, దేవదర్శిని, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

About Author