NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ్యోతిష్య, వాస్తువిద్వాన్ కు సూర్యచంద్ర అవార్డు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లి: పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త పండితుడు వెంకటరాముడు జ్యోతిష్య శాస్త్రంలో జాతీయ అవార్డును శుక్రవారం అందుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సూర్యచంద్ర సాహితీ సాంస్కృతిక సంస్థ తమ 25వ రజితోత్సవ సందర్భంగా పలు రంగాల్లో నిపుణులైన వారికి అవార్డులను ప్రకటించారు. ఇందులో బనగానపల్లె పట్టణానికి చెందిన జ్యోతిష్యశాస్త్రములో యూనివర్సిటీ పట్టభద్రుడైన వెంకటరాముడు గత 15 ఏళ్లుగా జ్యోతి శాస్త్రంలో,సమాజాసేవలో తనదైన శైలిలో పట్టణంలో పేరుగాంచారు. జ్యోతిష్య, వాస్తుపరంగా ఆయన ఇస్తున్న సలహాలు పలువురికి ఎంతో మేలు చేకూర్చాయి. ఈయన తన రంగంలో చేస్తున్న సేవలను గుర్తించి సూర్యచంద్ర సంస్థ హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో జాతీయ అవార్డును టిఆర్ఎస్ సలహాదారు వేణుగోపాలాచారి చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మోహన్ చంద్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జ్యోతి శాస్త్రంలో వెంకట్రాముడికి అవార్డు రావడం పట్ల పట్టణంలోని పరువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About Author