PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూర్యకుమార్ యాదవ్ సంచలన రికార్డు

1 min read

పల్లెవెలుగువెబ్: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఖాతాలోకి అత్యంత అరుదైన ఘనత వచ్చి చేరింది. తాజాగా, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సూర్య విరుచుకుపడ్డాడు. 244 స్ట్రైక్ రేట్‌తో 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు. రోహిత్ శర్మ, కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో బెంబేలెత్తించి జట్టు భారీ స్కోరు సాధించడంలో సాయపడ్డాడు.

About Author