NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ సూర్యనారాయణ స్వామి కి విశేషముగా జలాభిషేకం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   మీనసంక్రమణ పర్వదినం పురస్కరించుకొని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ కు పురుష సూక్త విధానంతో అరుణ ,మహా నారాయణా ,సున్నాలపన్న పారాయణంతో సుగంధ ద్రవ్య జలాభిషేకము విశేషముగా నిర్వహించడం జరిగినది.అనంతరం భక్తాదులు ఆనవాయితీ ప్రకారముగా సంక్రమణం రోజు స్వామివారి మూలవిరాట్ కు అభిషేకించినటువంటి సుగంధ ద్రవ్య జలమును వారి గృహమునకు మరియు వ్యాపార స్థలములకు తీసుకువెళ్లి అక్కడ అంతా ప్రోక్షణ చేసుకొని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఏడు రోజులపాటు ఈ జల తీర్థమును స్వీకరించిన వారికి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని ఇక్కడి ప్రశస్తి.అనంతరం స్వామివారికి అలంకరణ అర్చన రూపదీప నైవేద్యంతో నక్షత్ర మహా మంగళహారతి మంత్రపుష్పం వేద స్వస్తి నిర్వహించడం జరిగినది భక్తాదులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు.

About Author