NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మూడోసారి ప్రేమ‌లో ప‌డ్డ సుష్మితాసేన్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్‌ మరోసారి ప్రేమలో పడింది. మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌ లలిత్‌ మోదీతో డేటింగ్‌ చేస్తోంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు లలిత్‌. సుష్మితను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ వీరిద్దరూ కలిసి ఉన్న పలు ఫొటోలను షేర్‌ చేశాడు. ‘మాల్దీవుల్లో షికార్లు కొట్టాక లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నా. నా జీవిత భాగస్వామి సుష్మిత సేన్‌తో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారేమోననుకున్న నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేశారు. కాసేపటికే లలిత్‌ మోదీ తమ పెళ్లి గురించి క్లారిటీ ఇస్తూ.. ‘ప్రస్తుతానికి తామింకా డేటింగ్‌లోనే ఉన్నామని, ఒక్కరోజులోనే ఒకరితో ఒకరం ప్రేమలో పడిపోయాం’ అని చెప్పుకొచ్చాడు.

                                       

About Author