ఆ ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయండి : సోము వీర్రాజు
1 min readపల్లెవెలుగు వెబ్ : వైకాపా ఎమ్మెల్యేలు కొందరు హిందూమతాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నా… సీఎం జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. గోవధ చట్టాన్ని రద్దు చేయాలన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలోని దేవాలయాల సందర్శనలో భాగంగా గుంటూరు జిల్లా వినుకొండలో పర్యటించారు. ఓటు బ్యాంకు, మత రాజకీయాల నడుమ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.