తహసీల్దారు పై సస్పెన్షన్ వేటు
1 min read
పల్లెవెలుగువెబ్ : కుందుర్పి తహసీల్దారు తిప్పేస్వామిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు అనంతపురం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా కుందుర్పి విడిచి వెళ్లకూడదని ఆదేశాలిచ్చారు. ఇక కుందుర్పి తహసీల్దారుగా అదనపు బాధ్యతలను బ్రహ్మసముద్రం తహసీల్దారు బాలకిషన్‌కు అప్పగించారు. కుందుర్పి తహసీల్దారు తిప్పేస్వామి గతంలో ఆత్మకూరు తహసీల్దారుగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో గొరిదిండ్ల, సనప, ఆత్మకూరు, మదిగుబ్బ, పి.యాలేరు. బి.యాలేరు రెవెన్యూ గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత ఆర్‌డీఓ ద్వారా విచారణ జరిపించారు. వెబ్‌ల్యాండ్‌లో అవకతవకలకు పాల్పడి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్లు నిర్ధారణ కావడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.