మంత్రుల మానసిక ఆరోగ్యం పై అనుమానం !
1 min read
పల్లెవెలుగువెబ్: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ మంత్రులపై ధ్వజమెత్తారు. ఏపీ మంత్రులు బజారు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, వారి భాష అసభ్యకరంగా ఉందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది అభ్యంతరకరమని అన్నారు. ఇలాంటివాళ్లను మంత్రులుగా చేసిన జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని ఊళ్లమీదికి వదిలినట్టుందని విమర్శించారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే సంక్షేమ పథకాలు తొలగిస్తామని డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడడం సిగ్గుచేటని, అవసరమైతే ఓటర్ల కాళ్లు పట్టుకుంటామని మరో మంత్రి సీదిరి అప్పలరాజు అంటున్నాడని వెల్లడించారు.