అనుమానం పెనుభూతమై..భార్య హతం
1 min read
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ..సీఐ
భర్త అత్తపై కేసు నమోదు
నందికొట్కూరు, న్యూస్ నేడు: భర్త చేతిలో భార్య హతమైన సంఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి శేషాశయానా రెడ్డి నగర్ లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.నందికొట్కూరు పట్టణానికి చెందినమొల్ల నజీమూన్(21) భర్త మొల్లా అబ్దుల్లా చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.పట్టణ సీఐ వై ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన పఠాన్ అలీ భాష,ఆశాభీ పెద్ద కూతురు నజీమూన్ ను నందికొట్కూరు పట్టణానికి చెందిన దుర్వేసి మియా కుమారుడు మొల్లా అబ్దుల్లాకు 3 సం.ల క్రితం ఇచ్చి వివాహం చేశారు.నందికొట్కూరులో అబ్దుల్లా తన భార్య,అమ్మ నాన్న లతో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. అబ్దుల్లా తన భార్య నజీమూన్
తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినా అనుమానం
అదే పనిగా గొడవ పడుతూ భార్యను చిత్రహింసలకు గు రిచేసే వాడని శుక్రవారం సా 4 గంటల సమయంలో అబ్దుల్లా తన భార్యతో గొడవ పెట్టుకుని ఇంట్లో ఉన్న ఈల కత్తితో తన భార్య తలకు కుడివైపున,ఎడమ చేతి చూపుడు వేలుపైన కొట్టి రక్త గాయాలు,కట్టేతో ఎడమ తొడకు,కుడి తొడలకు కొట్టడంతో గాయాల పాలైన నజీమున్ ను మొదటగా నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు విషయం తెలుసుకున్న నజీమూన్ తల్లి తండ్రులు ఆసుపత్రి దగ్గరకు వచ్చే సరికి నజీమూన్ మరణించిందని నజీమూన్ తండ్రి పటాన్ అలీ బాష ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త మొల్ల అబ్దుల్లా,అత్త రఫి యాబీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.శనివారం ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్,రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం మరియు ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి మృతురాలు ఇంటికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
