PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదం పై అనుమానాలున్నాయి !

1 min read

పల్లెవెలుగు వెబ్​:చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలీకాప్టర్ ప్రమాదం పై అనుమానాలు ఉన్నాయ‌ని బీజేపీ ఎంపీ సుబ్రమ‌ణ్యస్వామి అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రభుత్వం తప్పనిసరిగా ఓ బయటి వ్యక్తి చేత విచారణ జరిపించాలని, సుప్రీంకోర్టు జడ్జి వంటివారి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. దేశ భద్రతకు ఇది చాలా పెద్ద హెచ్చరిక అని పేర్కొన్నారు. ఈ సంఘటనపై తుది నివేదిక ఇంకా రాలేదని, ఇప్పటికిప్పుడు ఏం చెప్పాలన్నా కష్టమని అన్నారు.

About Author