NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

షేన్ వార్న్ మృతి పై అనుమానాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) శుక్రవారం థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వార్న్‌ ఆకస్మిక మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన థాయ్‌ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. వార్న్‌ మరణించిన గదిలో ఫ్లోర్‌, టవల్స్‌పై అధిక మోతాదులో రక్తపు మరకలు గుర్తించామని పేర్కొన్నారు. వార్న్‌ మరణించడానికి ముందు భయాందోళనలకు గురై, నరక యాతన అనుభవించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. వార్న్‌ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి, ఆసుపత్రికి తరలించడానికి ముందు సీపీఆర్‌ చేశామని, గుండెపై ఒత్తిడి తెచ్చే క్రమంలో అతను రక్తపు వాంతులు చేసుకున్నాడని వార్న్‌ స్నేహితులు ప్రాధమిక విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఆదివారం థాయ్‌ అధికారులు వార్న్‌ భౌతికకాయానికి శవ పరీక్ష నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు సోమవారం వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ వార్న్‌ది అసాధారణ మరణం అయితే పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

                                        

About Author