PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

1 min read

– కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపిన ఘటన పగిడ్యాల మండలం ఎం. ఘణపురం గ్రామంలో వెలుగుచూసింది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఘణపురం గ్రామానికి చెందిన బోయ లక్ష్మీ దేవి( 38)ని పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన బోయ హుస్సేన్ కు ఇచ్చి 18 సంవత్సరాల కిందట వివాహం చేశారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు సంతానం.ఈ క్రమంలో ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మరో వ్యక్తితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. తరచూ భార్య భర్తలు గొడవలు పడేవారు.శుక్రవారం ఇరువురు మరోసారి గొడవ పడ్డారు. దీనితో మృతురాలు పుట్టింటికి వెళ్ళింది. ఇది జీర్ణించుకోలేని నిండుతుడు హుసేన్ తన భార్య పుట్టినిల్లు అయినా ఘనపురం గ్రామానికి వెళ్ళాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరిని లేని సమయం చూసి భార్య లక్ష్మీదేవి చంపాలని ఉద్దేశంతో కత్తితో దాడి చేశాడు. భార్య లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న ముచ్చుమర్రి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మకూరు డిఎస్పీ శ్రీనివాసరావు , నందికొట్కూరు సీఐ సుధాకర్ రెడ్డి లు ఘటనకు సంబంధించిన వివరాలు మృతురాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముచ్చుమర్రి ఎస్సై నాగార్జున కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

About Author