PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్యాంకర్లు అనుమానాస్పదమైన లావాదేవీలు జరగకుండా చర్యలు చేపట్టండి

1 min read

జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : బ్యాంకుల ద్వారా ఎటువంటి అనుమానాస్పదమైన లావాదేవీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన బ్యాంకర్లను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకుల ద్వారా నగదు లావాదేవీలు, పోస్టల్ కార్డుల డిస్పాచ్ పై బ్యాంకర్స్, పోస్టల్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల వ్యయ నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అమలులోకి వస్తుందన్నారు. ఎప్పుడైతే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందో అప్పటి నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి గాను ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా వారి ఓటు హక్కును స్వేచ్చగా నిర్వహించాడం ఎన్నికల కమీషన్ ఉద్దేశ్యం కాబట్టి బ్యాంకులు కూడా ఆ కారణంగా ప్రముఖంగా ఉంటాయన్నారు. అందుకుగాను బ్యాంకులు నగదు లావాదేవీలకు సంబంధించి కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలన్నారు.  ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి గత రెండు నెలలుగా లక్ష అంతకు మించిన నగదు లావాదేవీలు (డిపాజిట్/విత్ డ్రా) లేని ఖాతాలో ఉన్నట్టుండి నగదు డిపాజిట్/విత్ డ్రా చేసినట్లయితే సదరు బ్యాంకు ఖాతాను అనుమానాస్పద ఖాతాగా గుర్తించి బ్యాంకర్లు వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొని రావాలన్నారు. అలాంటి ఖాతాలను ఎన్నికల వ్యయ నిర్వహణ సభ్యులు ఎల్డిఎం, నోడల్ అధికారులతో విచారణ చేయించడం జరుగుతుందన్నారు. బ్యాంకు ఖాతా నుంచి ఆన్లైన్ (అర్టిజీస్) విధానం ద్వారా ఒకే సారి ఎక్కువ మంది ఖాతాలకు గతంలో ఎన్నడూ జరగని ఆన్లైన్ లావాదేవీలు జరగకుండా ఉండి ఉన్నట్టుండి జరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా బ్యాంకులు నివేదిక అందజేయాలన్నారు.అభ్యర్థి బ్యాంకు ఖాతా, అభ్యర్థి భార్య/భర్త, అభ్యర్థి డిపెండెంట్స్ సంబంధించి వారు నామినేషన్ వేసే సమయంలో అఫిడవిట్ లో పొందుపరిచిన బ్యాంకు ఖాతాల నుండి లక్ష అంతకు మించి డిపాజిట్/విత్ డ్రా చేసినట్లయితే అందుకు సంబంధించిన వివరాలను కూడా బ్యాంకర్స్ ఇవ్వాలన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల నుండి లక్ష రూపాయలు అంతకు మించి విత్ డ్రా చేసేన వారి వివరాలను కూడా గమనిస్తూ జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొని రావాలన్నారు. పై తెలిపిన కారణాలు కాకుండా ఒకే రోజులో ఒకే ఖాతాలో పెద్ద మొత్తం నగదు జమ అవుతున్న, అటువంటి అనుమానాస్పద ఖాతాల వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తే వారు మా దృష్టికి తీసుకొని వస్తారన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద నగదును ఓటర్ల ప్రలోభాలకు వాడుతున్నారని అనుమానం వచ్చిన మాకు సమాచారం అందిస్తే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ద్వారా విచారణ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా బ్యాంకు ఖాతా నుండి పది లక్షలు అంతకు మించి నగదు డిపాజిట్/విత్ డ్రా చేసినట్లయితే వారి వివరాలను ఎన్నికల వ్యయ నిర్వహణ నోడల్ అధికారి ద్వారా ఆదాయపు పన్ను వారికి తెలియజేయడం జరుగుతుందన్నారు. బ్యాంకులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అన్ని లావాదేవీలకు సంబంధించిన వివరాలను ప్రతి రోజూ పంపే దిశగా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ బ్యాంకర్స్ ను ఆదేశించారు.బ్యాంకులు వారికి సంబంధించిన నగదు ఇతర బ్యాంకులకు పంపడం, లేక సంబంధిత బ్యాంకు చెస్ట్ నుండి నగదును డిపాజిట్/విత్ డ్రా చేసుకునే సమయంలో జిల్లా ఎన్నికల అధికారికి తెలియజేయడంతో పాటు ఆన్లైన్ లో సదరు బ్యాంకు వివరాలు, వాహనం వివరాలు నమోదు చేయడం ద్వారా ఒక క్యూఆర్ కోడ్ జెనరేట్ చేయడం జరుగుతుందని, సంబంధిత వాహనానికి క్యూఆర్ కోడ్ అతికించడం ద్వారా పోలీసులు సంబంధిత క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసినప్పుడు సదరు నగదు బ్యాంకుకు సంబంధించిన నగదు అని వారికి తెలిసే అవకాశం ఉంటుందన్నారు.ఎపిక్ కార్డులకు సంబంధించి డెలివరీనీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అదే విధంగా రానున్న కార్డులను కూడా పోలింగ్ రోజు నాటికి ఓటర్లందరికి ఎపిక్ కార్డులు అందజేసేలా చర్యలు తీసుకోవాలని పోస్టల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి పంపే వాటి డిస్పాచ్ వివరాలు ఆర్ఓల దగ్గర ఉండే విధంగా చూసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ను డెలివరీ చేసే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ను ఏవిధమైన ట్యాపరింగ్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఎంట్రీ, ఎక్సైట్ (exit) పాయింట్స్ దగ్గర సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.ఎన్నికల వ్యయ నిర్వహణ అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఎస్హెచ్జి (SHG), చిరు వ్యాపారులు తీసుకున్న బ్యాంకు రుణాలకు సంబంధించిన నగదును ఒకేసారి చెల్లిస్తున్నారా అనే దాని వివరాలు, పెండింగ్ లోన్ తిరిగి చెల్లింపులు ఒకే సారి చెల్లించడం వాటిపై కూడా దృష్టి సారించాలన్నారు. గత కొంత కాలంగా ఆపరేటివ్ లో లేని బ్యాంకు ఖాతాలు ఒకే సారి యాక్టివ్ అవ్వడం పై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్జిఓస్ (NGO’s), దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, ట్రస్టీలకు చెందిన బ్యాంకు ఖాతాలకు ఎటువంటి లావాదేవీలు జరిగిన సదరు వివరాలను ఒక ఫార్మాట్ రూపంలో పంపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమీషనర్ భార్గవ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి, డిఆర్ఓ మధుసూదన్ రావు, ఎల్డిఎం రామచంద్ర రావు, డిసిఓ రామాంజనేయులు, బ్యాంకర్స్, పోస్టల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author