గురుకుల పాఠశాలలో స్వచ్ఛఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం
1 min read
పరిసరాలపరిశుభ్రత, పచ్చదనం నీటివాడకం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించిన కళాశాల ప్రిన్సిపల్ మేరీ ఝాన్సీ రాణి
పల్లెవెలుగు,ఏలూరు జిల్లా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ఏలూరు జిల్లాలోని, వట్లూరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మరియు విద్యార్థులకు పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దానిలో భాగంగా వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది. గ్రీన్ అంబాసిడర్స్ ఎంపిక, చెత్తను తడి చెత్త,పొడి చెత్త, హానికర వ్యర్దాలు గా వేరు చేయడం, నీటి వాడకం, వృధాను నివారించడం విద్యార్థులకు అవగాహన కల్పించారు, కళాశాల ప్రాంగణం శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనంతరం వివిధ రకాల మొక్కలను నాటారు. కళాశాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, మరిన్ని మొక్కలు నాటాలని, పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యం ఈ మూడు సూత్రాలను పాటించాలని విద్యార్థులందరూ ప్రతిజ్ఞ చేశారు.