PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వధర్మం కన్నతల్లి వంటిది

1 min read

– గుమ్మళ్శ సత్యం…విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త కార్యదర్శి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అన్న శ్రీమద్భగవద్గీత శ్లోకం  ప్రకారం మన ధర్మం కన్నతల్లి వంటిదని దానిని పాటించడమే శ్రేయస్కరమనీ పరధర్మం ఎప్పుడూ భయంకరమైనది కావునా ఎవ్వరైనా తమ ధర్మాన్ని మాత్రం పాటించాని లేకుంటే ఇబ్బందులు వస్తాయని కర్నూలు జిల్లా ధర్మప్రసార్ విభాగం ఆధ్వర్యంలో   వెల్దుర్తి లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన జరిగిన ఒక్కరోజు శిక్షణా శిబిరం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న  కేంద్రీయ సంయుక్త కార్యదర్శి గుమ్మళ్శ సత్యం అన్నారు. ఇంకా మాట్లాడుతూ హైందవ సనాతన ధర్మం అతి పురాతనమైనదని ఎవరూ ఈ ధర్మాన్ని సృష్టించలేదనీ తనంతట తానుగా ఉద్భవించినదనీ దానినే భారతదేశంలో ప్రజలందరూ పాటిస్తారు, దేవతలు జన్మించిన నడయాడిన పుణ్యభూమి భారతదేశం మాత్రమే అని ప్రలోభాలకు లోనై పరధర్మాన్ని ఆశ్రయించిన సోదరులను తిరిగి స్వధర్మాచరణం వైపు వచ్చేలా చూడాలని పిలుపు నిచ్చారు రాష్ట్ర ధర్మప్రసార్ కో కన్వీనర్ ఏ.వీ.ప్రసాద్ మాట్లాడుతూ ధర్మప్రసార్ విభాగంలో పనిచేసే  కార్యకర్తలు గ్రామ గ్రామానా కార్యకర్తల గణాన్ని పెంచాలని తద్వారా ధర్మాన్ని విడిచిన సోదరులను తిరిగి స్వధర్మానికి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ అంకాలయ్య,విభాగ్ కన్వీనర్ కాళంగి విజయుడు,ధర్మరక్షలు తిమ్మయ్య,సిద్దయ్య,సురేంద్ర,వీరశేఖరఆచారి,వెంకటరణ ఆచారి,యరమల్లె మరియూ 6 మండలాలు 42 గ్రామాలు నుండి 102 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author