NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వామి వివేకానంద సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు..

1 min read

బి.వి కృష్ణారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్

నేడు వివేకానంద జయంతి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న జిల్లా రెడ్ క్రాస్  చైర్మన్ బివి కృష్ణారెడ్డి మరియు సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద సనాతన ధర్మం  గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని, ఆయన సిద్ధాంతాలు యువతను సన్మార్గంలో నడిపింపజేసేలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు. వివేకానంద సూక్తులను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది యువత గొప్పవారయ్యారని అన్నారు. ఆయన జయంతిని ప్రతి ఏటా జాతీయ యువజన దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కే వరప్రసాదరావు, రెడ్ క్రాస్ కార్యదర్శి కేబి సీతారాం,  జి జ్ఞాన వేణి, సిహెచ్ అనూష, డి శిరీష, ఎన్ విజయ, కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

About Author