NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వామి వివేకానంద.. యువతకు స్ఫూర్తి :గోరంట్ల శకుంతల

1 min read
పల్లెవెలుగు వెబ్​:స్వామి వివేకానంద అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన మార్గంలో యువత నడవాలని రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గోరంట్ల శకుంతల అన్నారు. నగరంలో అశోక్ నగర్ పంప్ హౌస్ వద్ద నిరాశ్రయుల వసతి గృహంలో స్వామి వివేకానంద  జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా గోరంట్ల శకుంతల మాట్లాడుతూ  విదేశాలలో భారతదేశం గొప్పదనాన్ని స్వామి వివేకానంద చాటి చెప్పారని అన్నారు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు స్వామి వివేకానంద అని  తెలిపారు. అన్నిమతాల సారాంశం ఒక్కటే అని చాటి చెప్పారన్నారు. పెడదారిలో పడుతున్న నేటి యువత వివేకానందను  స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని ఆయన  అడుగుజాడల్లో సన్మార్గంలో నడవాలని హితవు పలికారు. భారతదేశపు ఔన్నత్యాన్ని దేశంలోని దశదిశల చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో వసతిగృహంలో ని మహిళలు  పాల్గొన్నారు.

About Author