స్వరం మార్చి ..ప్రజా సమస్యలపై గళం
1 min read– అధిక ధరలపై బాదుడే బాదుడంటూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న.. మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి..
పల్లెవెలుగు , వెబ్ పాణ్యం : నియోజకవర్గం వైసిపి ప్రభుత్వం మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రజలపై మోపుతున్న ధరల భారాన్ని పాణ్యం టిడిపి ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వివిధ కాలనీలో బాదుడే బాదుడంటూ కరపత్రాల ద్వారా ప్రభుత్వం చేపట్టిన వ్యతిరేక విధానాలను వివరిస్తూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ఎన్నికలకు 15 నెలలు మిగిలి ఉండగానే జాతీయ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజాక్షేత్రంలో ఉండాలని నియోజకవర్గంలో పట్టు పెంచుకోవాలని నియోజకవర్గ ఇన్చార్జిలతో సమీక్షలు జరిపి ఆదేశించడంతో నియోజవర్గ పర్యటనలో స్పీడ్ పెంచారు మండల స్థాయి కోఆర్డినేటర్లతో అధ్యక్షులతో సీనియర్ నాయకులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూ నంద్యాల టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి నియోజకవర్గ స్థాయిలో వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. సౌమ్యురాలు సమస్యలపై తక్షణం స్పందించే గౌరు చరితారెడ్డి క్యాడర్ ను కలుపుకుంటూ మండల స్థాయిలో స్థానికంగా ఉండే సమస్యలపై గళం ఎత్తుతున్నారు స్వరం మార్చి ప్రత్యర్థులపై ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు స్థానికంగా ఉండే కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ కార్యకర్తల ఆహ్వానం మేరకు ఇళ్లకు వెళ్లి ప్రత్యేకంగా వారి ఆనందాలలో పాలుపంచుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో తన విజయానికి కృషి చేయాలని టిడిపి పార్టీ తరఫున భారీ మెజార్టీ సాధించేలా వ్యూహాలు రచిస్తున్నారు మొత్తానికి క్యాడర్ ను నాయకులను కలుపుకుంటూ సాగిస్తున్న ఈ కార్యక్రమాలతో స్పీడ్ పెంచడం టిడిపి శ్రేణుల్లో జోష్ నింపుతుంది.