కలెక్టరేట్ లో స్వర్ణఆంధ్ర- స్వచ్ఛఆంధ్ర కార్యక్రమం
1 min read
జాయింట్ కలెక్టర్ పి ధాత్రి రెడ్డి
ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలి
సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పర్యావరణ పరిరక్షణ లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండం లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి పిలుపు ఇచ్చారు. స్ధానిక ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో డి ఆర్ ఓ వి.విశ్వేశ్వరరావు , పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు వి. శ్రీలక్ష్మి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకిరాణి, పలువురు జిల్లా అధికారులు,కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టరేట్ ప్రాంగణం ప్రహరీ గోడలకు సున్నం వేశారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర – స్వచ్చంధ్ర కార్యక్రమాలలో భాగంగా ప్రతినెలా ఒక థీమ్ తో కూడిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే మార్చి నెలలో సింగిల్ యాజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించే క్రమంలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. స్వచ్ఛంధ్ర కార్యక్రమం నిర్వహణా పనితీరు పై, ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు కార్యాలయాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.