స్వరూపానంద సరస్వతి అస్తమయం
1 min read
పల్లెవెలుగువెబ్ : ద్వారకాపీఠ్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి సుదీర్ఘ అస్వస్థతతో ఆదివారంనాడు పరమపదించారు. 99 ఏళ్ల స్వరూపానంద సరస్వతి మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లో ఉన్న శ్రీథామ్ జోతేశ్వర్ అశ్రమ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు. 1924లో జన్మించిన శంకరాచార్య స్వామి 2018లో బృందావనంలో తమ 95వ జన్మదినం జరుపుకోగా, పరమేశ్వరుడు పార్వతీ దేవిని భార్యగా స్వీకరించిన రోజుకు గుర్తుగా ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకొనే హరియాలి తీజ్ రోజున ఆయన తన 99వ పుట్టినరోజు జరుపుకొన్నారు.