కుక్కలు, నక్కలు అంటూ తిట్టుకుంటున్న.. బండ్లగణేష్ , సాయిరెడ్డి !
1 min readపల్లెవెలుగువెబ్ : సోషల్ మీడియా వేదికగా నిర్మాత బండ్ల గణేష్, వైఎస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి మధ్య మాటల యుద్దం ముదురుతోంది. ట్విట్టర్ లోఇద్దరూ పోటాపోటీగా, ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ల దుమారం రేపుతున్నారు. ‘‘ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో…గణేశా!’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయగా..
‘‘ఎస్ నేను కుక్కనే కానీ దానిలా విశ్వాసం ఉన్నవాడిని.. నీలా పిచ్చికుక్కను కాదు తెలుసుకో దొంగ సాయి.. మేము ఏం చేసుకున్నా మా సొంతానికి చేసుకున్నాం కష్టపడ్డాం నీలా దోచుకోలేదు దొంగ సొమ్ము దాచుకోలేదు. ఒక్కటి గుర్తు పెట్టుకో దొంగసాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీ వెనకాల లేకపోతే నీ చరిత్ర ఏంటో.. నీవు ఏంటో నీ బ్రతుకు ఏంటో ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసుకో తెలుస్తోంది..మీ దగ్గర అధికారం ఉంది దొంగసాయి గారూ..అరెస్ట్ చేయిస్తారో కేసులు పెట్టిస్తారో.. కొట్టిస్తారో ఇంకెన్నేన్ని చేస్తారో. అయినా మీతో నేను పోరాడుతూనే ఉంటా దొంగ సాయి గారు. ఆంధ్రప్రదేశ్ అనే ఉద్యానవనంలో మొలసిన గంజాయి మొక్క మీరు.. ఆ గంజాయి మొక్కను పీకేసే ఒక తెలుగువాడిగా నా కర్తవ్యం.“ అంటూ బండ్ల గణేష్ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు.