భగత్ సింగ్ స్వగ్రామంలో ప్రమాణస్వీకారం !
1 min read
పల్లెవెలుగువెబ్ : పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా భగవంత్ సింగ్ మాన్ ప్రమాణస్వీకారం చేయడమే తరువాయి. ఈ నేపథ్యంలో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనని తేల్చిచెప్పారు. భగత్‌సింగ్ గ్రామమైన ఖట్కర్‌కలన్‌లో ప్రమాణం చేయబోతున్నట్టు ప్రకటించారు. ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్న నేపథ్యంలో భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడారు. దేశానికి భగత్‌సింగ్ చేసిన సేవలను గుర్తిస్తూ.. ఆయన జన్మస్థలంలో ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.