ఏథికల్ ఓటింగ్ లక్ష్యంగా స్వీప్ కార్యక్రమాలు..
1 min readపట్టణ నవ యువ ఓటర్లకు అవగాహన సదస్సు
డీపీవో తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు పునాది వంటిదని, ఏథికల్ ఓటింగ్ లక్ష్యంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి,జిల్లా స్వీప్ నోడల్ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు. స్వీప్ కార్యాచరణలో భాగంగా శుక్రవారం జిల్లాలో ఏలూరు సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల,చింతలపూడి,బుట్ట యిగుడెం,జంగారెడ్డి గూడెం, కామ వరపుకోట,కైకలూరు,ఉంగుటూరు డిగ్రీ కాలేజీలలో జిల్లా స్వీప్ నోడల్ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ అధ్వర్యంలో ఓటర్ల చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సెయింట్ ఆన్స్ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ వారీ ఆదేశాలతో ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు కీలకమైనదని, ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటు హక్కు వినియోగం ప్రాముఖ్యత పై పట్టణ ఓటర్లు పూర్తిస్థాయిలో పోలింగ్ వెళ్లే విధంగా ప్రోత్సాహించడానికి స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా స్వీప్ యాక్షన్ ప్రణాళిక అమలుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఓటర్లలో చైతన్యం కోసం, ఓటు హక్కు వినియోగం కోసం, పట్టణ ఓటర్లు పూర్తిస్థాయిలో పోలింగ్ వెళ్లే విధంగా ప్రోత్సాహించడాని మరియు పట్టణ నవ యువ ఓటర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. మహిళా ఓటర్ల ప్రేరణ లక్ష్యంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. రెండో రోజు కార్యక్రమాలలో భాగంగా స్వీప్ అని విద్యార్థులతో డీపీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షరమాల కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో సెయింట్ ఆన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ మెర్సీ, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థినులు, పాల్గొన్నారు.