తెలంగాణలో మంకీపాక్స్ లక్షణాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ పాక్స్ భారత్‌కు కూడా పాకింది. ఇప్పటికే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ ఢిల్లీలో ఓ వ్యక్తికి మంకీ పాక్స్ నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే కామారెడ్డి జిల్లాలో మంకీ పాక్స్ కలకలం రేగింది. ఇంద్రానగర్ కాలనీలో ఓ వ్యక్తికి మంకీ ఫాక్స్ సోకినట్లు అనుమానం వ్యక్తమైంది. దాంతో ఆయనను వైద్యులు ఈ నెల 20 నుంచి అబ్జర్వేషన్‌లో ఉంచారు. మంకీ ఫాక్స్‌గా అనుమానించి బాధితుడిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి హైదరాబాద్ తరలించారు. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో వ్యక్తి నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపారు.