NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధ్యాయులకు టీ.ఎ.ఆర్.ఎల్ శిక్షణ

1 min read

పల్లెవెలుగు, వెబ్​ గడివేముల: మండలంలోని స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయులకు టి.ఎ.ఆర్.ఎల్ పై శిక్షణ ప్రారంభించినట్లు ఎంఈఓ రామకృష్ణుడు తెలిపారు.టీచింగ్ అట్ రైట్ లెవెల్ శిక్షణను మండలంలోని పాఠశాలల్లో 3,4,5 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు అందరికీ ఉంటుందని సోమవారం నాడు ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో ఎంఈఓ రామకృష్ణుడు తెలిపారు, ఈ శిక్షణ రెండు విడతల్లో ఏర్పాటు చేసినట్లు, మొదటి విడత17,18,19,20 మరియు రెండవ విడత 21,22,24,26వ తేదీలలో ఉంటుందని, ఒక్కో విడత నాలుగు రోజులు ఉంటుందని, మొదటి విడత సగం మంది ఉపాధ్యాయులు, రెండో విడతలో సగం మంది ఉపాధ్యాయులు ప్రతి పాఠశాల నుంచి హాజరవుతారని ఎంఈఓ తెలిపారు. ఈ శిక్షణలో స్థాయికి తగ్గ బోధన, సులభ పద్ధతిలో బోధన, ఆటపాటలతో బోధన, బోధనోపకరణాల తయారీ తదితర అంశాలలో శిక్షణ ఉంటుందని తెలిపారు శిక్షణ కార్యక్రమంలో. కోర్స్ డైరెక్టర్ ఎంఈఓ .. రామకృష్ణుడు.. రిసోర్స్ పర్సన్స్. డి మహబూబ్ బాషా. కే నాగలక్ష్మి. కే రాజేష్. వి నాగరాజు. పాల్గొన్నారు.

About Author