PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

T20 ప్రపంచ క‌ప్ షెడ్యూల్ విడుద‌ల

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఓమ‌న్ తో పాటు యూఏఈ లో జ‌ర‌గ‌బోయే టీ ట్వంటీ ప్రపంచ క‌ప్ షెడ్యూల్ విడుద‌ల అయింది. అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14 వ‌ర‌కు ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది. న‌వంబ‌ర్ 10,11 తేదీల్లో సెమీఫైన‌ల్, న‌వంబ‌ర్ 14న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. సెమీస్, ఫైన‌ల్ మ్యాచ్ ల‌కు రిజ‌ర్వ్ డే కేటాయించారు. అక్టోబ‌ర్ 24న భార‌త్-పాక్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. తొలి రౌండ్లో గ్రూప్- బి నుంచి పోరు మొద‌ల‌వుతుంది. అక్టోబ‌ర్ 17న మ‌ధ్యాహ్నం మ్యాచ్ లో ఒమ‌న్, ప‌పువా న్యూగినీ త‌ల‌ప‌డుతాయి. సాయంత్రం బంగ్లాదేశ్, స్కాట్ లాండ్ మ‌ధ్య పోరు జ‌ర‌గ‌నుంది. సూప‌ర్ 12 మ్యాచ్ లు అక్టోబ‌ర్ 23 నుంచి మొద‌లవుతాయి. గ్రూప్ ఏ లో న‌మిబీయా, నెద‌ర్లాండ్స్ , ఐర్లాండ్, శ్రీల‌ంక అబుదాబిలో త‌ల‌ప‌డుతాయి.

About Author