PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ప్రారంభించిన  డా . చల్లా వాసు రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క్రమశిక్షణ   క్రీడలకు మించిన సాధనం లేదని  డాక్టర్ చల్లావాస్ రెడ్డి.నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ పార్కులో ఏర్పాటు చేసిన టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. బెల్ట్ గ్రేడింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఆయన బెల్ట్ ల ను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్. చల్లా వాసిరెడ్డి. మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా  మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయడం వల్ల ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ అంకిత భావం పెంపొందుతాయని వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ విద్యార్థులు విద్యార్థులు పొందేలా ప్రోత్సహించాలని  పొందడం వల్ల అలాంటి ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ  ఎదుగుతారని  చెప్పారు. టైక్వాండో లో సాధన చేయడం వల్ల  ఆరోగ్యాన్ని పెంపొందించే వ్యాయామాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం పిల్లల్లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఎక్కువగా ఉందని స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగించడం వల్ల మంచి కంటే చెడుకే అవకాశం ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి  క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని చెప్పారు. స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల కంటి సమస్యలతో పాటు అది మెదడుపై ప్రభావం చూపి ఏకాగ్రతను దెబ్బతీస్తుందని ఫలితంగా చదువులో వెనుకబడిపోతారని చెప్పారు.  ఇందుకు క్రీడలు మంచి సాధనమని చెప్పారు. అందుకే క్రీడలను ప్రోత్సహించేందుకు తాను ప్రాధాన్యత ఇస్తున్నానని  డాక్టర్ చల్లా వాసు రెడ్డి  వివరించారు .ఈ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ జిల్లా జాయింట్ కార్యదర్శి టి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author