చిన్నారులకు టైక్వాండో బెల్టుల ప్రధానం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కరోన సమయంలో టైక్వాండో కసరత్తు చేయడం వల్ల ఆరోగ్యం పెంపొందడమే కాక మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారని అభినందించారు స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ కెన్ వి రాజు. నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ కెన్ వి రాజు పాల్గొని చిన్నారులకు కలరు బెల్టులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కోచ్ రాజు మాట్లాడుతూ టైక్వాండో క్రీడను ప్రభుత్వం గుర్తించిందని, క్రీడలో సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రామాంజనేయులు,టైక్వాండో అకాడమీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు,సీనియర్ హ్యాండ్ బాల్ క్రీడాకారుడు కిరణ్ తదితర టైక్వాండో మాస్టర్ లు పాల్గొన్నారు.