ఆరోగ్యం.. ఆత్మరక్షణకు ‘తైక్వాండో’ అవసరం : ఎమ్మెల్యే
1 min read– 25 మంది విద్యార్థులకు బెల్టులు ప్రధానం
పల్లెవెలుగు వెబ్: ఆరోగ్యం ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ తైక్వాండో సాధన అవసరమని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ సూచించారు. ఆదివారం కర్నూల్ ఆగ్రసెని హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన తైక్వాండో బెల్ట్ గ్రేడేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కోచ్ షబ్బీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు 25 మంది విద్యార్థులకు బెల్టులు ప్రధానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ తైక్వాండోకు ఒలంపిక్స్ లో ఆడే అవకాశం ఉన్నందున విద్యార్థులు అధిక సంఖ్యలో శిక్షణ పొంది రాష్ట్ర దేశ స్థాయిలో కర్నూల్ జిల్లాకు గుర్తింపు తేవాలని అన్నారు. కోచ్ షబ్బీర్ హుస్సేన్ తో శిక్షణ పొందిన వారంతా ఒలంపిక్స్ లో ఆడే అవకాశం సంప్రదించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.