గడ్డం పెంచిన మాత్రాన ఠాగూర్ అయిపోరు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేయాలని చూడటం దుర్మార్గమని సీపీఐ నారాయణ మండిపడ్డారు. త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలోనే అదానీ, అంబానీలు వందల కోట్లు సంపాదించుకున్నారని చెప్పారు. పేదలు మాత్రం తిండి దొరక్క పస్తులతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గడ్డం పెంచుకున్నంత మాత్రాన రవీంద్రనాధ్ ఠాగూర్ అయిపోరన్నారు.