కల్వరి కొండ’స్థలాన్ని పరిశీలించిన తహసిల్దార్…ఎస్ఐ
1 min read
కులం పేరుతో దూషించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని మాసపేట గ్రామ పొలిమేర అయిన దిగువ పాడు గట్టు పైన ఉన్న ఆర్సిఎం కల్వరి కొండ గుడి దగ్గర ప్రార్థనలు చేసుకుంటూ ఉండగా దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందేనని మిడుతూరు ఎస్సై ఓబులేసును మహిళలు పట్టుబట్టారు.దిగువపాడు గ్రామం గట్టు పైన ఉన్న ఆర్ సీఎం కల్వరి కొండ గుడి దగ్గర చర్చి స్థలాన్ని మిడుతూరు తహసిల్దార్ శ్రీనివాసులు మరియు ఎస్ఐ ఓబులేష్ సోమవారం మ.3 గంటలకు పరిశీలించారు.ఇరువురి మధ్య ఏమేమి పత్రాలు ఉన్నాయని వారిని తహసిల్దార్ అడగ్గాగుడికి సంబంధించిన వారి దగ్గర కొన్ని పత్రాలు ఉన్నాయని వేరే వర్గం వారి దగ్గర ఏమి పత్రాలు లేవని తహసిల్దార్ అన్నారు.మండల మరియు జిల్లా సర్వేయర్ ను పిలిపించి ఇక్కడ స్థలాన్ని పరిశీలిస్తామని తహసిల్దార్ తెలిపారు.చర్చి స్థలాన్ని చర్చికే చెందాలని ఇక్కడికి ప్రార్థనల కోసం 10 గ్రామాల ప్రజలు వస్తూ ఉన్నారని వివిధ గ్రామాల క్రైస్తవులు అన్నారు.ప్రతి సంవత్సరం జరిగే గుడ్ ఫ్రైడే రోజున దాదాపు వెయ్యి మంది దాకా ప్రార్థనల్లో పాల్గొంటున్నామని 1986 నుండి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.గుడి విషయంలో అన్యాయం జరిగితే మాత్రం ఎందా కైనా వెళ్తాం సహించే ప్రసక్తే అధికారులతో క్రైస్తవులు అన్నారు.ఈ కార్యక్రమంలో సంజీవరాజు,గ్రామ సర్వే జుబేర్,ఆర్ సీఎం విచారణ గురువులు ఫాదర్ మధు బాబు,జయరాజు, మరియదాస్ మరియు మహిళలు క్రైస్తవులు పాల్గొన్నారు.
