అక్రమ రిజిస్ట్రేషన్ పై తహసీల్దార్ విచారణ
1 min read
మంత్రాలయం, న్యూస్ నేడు : మండల పరిధిలోని రచుమర్రి గ్రామానికి చెందిన కడతట్ల వెంకటలక్షి చెందిన పొలంను కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయం పై శుక్రవారం మంత్రాలయం తహసిల్దార్ రమాదేవి కి విచారణ జరిపి న్యాయం చేయాలని వినతి పత్రం అందించారు. దీంతో బుధవారం రచ్చుమర్రి లో తహసీల్దార్ రమాదేవి, ఆర్ ఐ జనార్దన్, సర్వేయర్ అశోక్ కుమార్ లు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నంబరు 90/2004 ద్వారా సర్వే నంబరు 451/A1 లో 0.42 సెంట్ల భూమి పై ఇరువర్గాల కడతట్ల వెంకటలక్షి, మజ్జిగ రామదాసు ల పొలం పత్రాలు పరిశీలించారు. ఇందు లో మజ్జిగ రామదాసు పొలం పత్రాలలో రామదాసు పేరు కాకుండా వేరే వారి పేరు ఉండడంతో నీకు పొలం సంబంధం లేదని తహసీల్దార్ రమాదేవి సూచించారు. కడతట్ల వెంకటలక్షి కి పత్రాలు సక్రమంగా ఉన్నాయని ఆమె తెలిపారు. విచారణ జరిపి నివేదిక తయారు చేయాలని ఆర్ ఐ జనార్దన్, సర్వేయర్ అశోక్ లను ఆదేశించారు. వీరు ఇచ్చిన నివేదిక ను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పంపడం జరుగుతుందని తెలిపారు. సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విచారణ లో వీఆర్వో రంగయ్య, రైతు కడతట్ల నరసింహులు, చుట్టు పక్కల రైతులు ఉన్నారు.