NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

100 అడుగుల లోయ‌లోకి బ‌స్సు.. 10 మంది `అనంత` లోకాల‌కు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తిరుప‌తి శేషాచలం ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. నిశ్చితార్థ వేడుక కోసం అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి బయలుదేరిన బస్సు లోయలో పడిపోయింది. బాధితులంతా కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులే! అంతా ఉల్లాసంగా మాట్లాడుకుంటూ ప్రయాణం సాగిస్తుండగా… పీలేరు – తిరుపతి మధ్య ఉన్న భాకరాపేట ఘాట్‌ రోడ్డులో… సుమారు 100 అడుగుల లోయలో బస్సు పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు పది మంది అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్యపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రమాద సమయంలో బస్సులో 50 నుంచి 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 40 మందికి గాయాలైనట్లు సమాచారం. వీరిలో పెళ్లికుమారుడు మల్లిశెట్టి వేణు కూడా ఉన్నారు. ఎక్కువ మంది తలలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పెద్దసంఖ్యలో పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలోనే ఈ ఘోరం జరిగింది. రాత్రివేళ… ఘాట్‌ రోడ్డులో వాహన సంచారం తక్కువ కావడంతో సుమారు రెండు గంటలపాటు బయటి ప్రపంచానికి ఈ విషయం తెలియలేదు.

                                  

About Author