విద్యార్థులను వేధిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోండి: RYSF
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ధనార్జనే ధ్యేయంగా నెలకొల్పడం వలన పరీక్ష సమయంలో ఫీజుల పేరుతో హల్ టికెట్ ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక మండల విద్యాధికారి (MEO) ఆంజనేయులు గారికి రాయలసీమ యువ విద్యార్థి సమాఖ్య (RYSF) ఆధ్వర్యంలో తాలూకా ప్రధాన కార్యదర్శి తిమ్మరాజు అధ్యక్షతన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం తాలుకా అధ్యక్షుడు రాముడు మాట్లాడుతూ పట్టణంలో పుట్ట గొడుగుల్లా ఏర్పడిన ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు పరీక్ష సమయంలో ఫీజుల పేరుతో హాల్టికెట్లు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడం చాలా సిగ్గుచేటని అన్నారు. పరీక్ష సమయంలో ప్రతి విద్యార్థికి ఫీజుతో సంబంధం లేకుండా హాల్ టికెట్లు సరైన సమయంలో మంజూరు చేయాలని, అలాగే విద్యార్థులకు బస్ సౌకర్యం, మరియు పరీక్ష కేంద్రాలలో త్రాగు నీరు, ఫ్యాన్లు, టేబుళ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు మానసిక ధైర్యాన్ని పెంచుకోవాలని, ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని వారు విద్యార్థులను కోరారు. పరీక్ష సమయంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వ అధికారులు పర్యవేక్షిస్తూ పేద విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. అలాగే ఫీజుల పేరుతో విద్యార్థులను వేధింపులకు గురిచేసే అటువంటి విద్యా సంస్థలపై ఆర్.వై.ఎస్.ఎఫ్ అధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు: పూర్ణ, దక్షిణ మూర్తి, చిన్న రంగడు, ఆంజనేయులు, రాముడు, హేమంత్, మల్లి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు