సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి
1 min read
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని స్వయంగా కలిసి విజ్ఞప్తి
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : నాయిబ్రాహ్మణల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయింపు, కుక్కునూరు మండలంలో విద్యుత్ సమస్య, పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలుపుదల, పొగాకు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సమస్యల పరిష్కారం కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి వినతి పత్రాలు అందజేసిన ఎంపీ పుట్టా మహేష్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని సానుకూలత వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతి సచివాలయం బ్లాక్ నంబరు-1లో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు స్వయంగా కలిసి వినతి పత్రాలు అందజేశారు. నాయి బ్రాహ్మణల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించండి.పొగాకు రైతులను ఆదుకోవాలని వినతి.ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సాగుచేసే పొగాకుకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నందున ఈ ఏడాది ప్రభుత్వం 48 మిలియన్ కిలోలకు మాత్రమే అనుమతిచ్చిందని, రైతుల విజ్ఞప్తి మేరకు 58.25 మిలియన్ కిలోల పొగాకు పంటకు అనుమతి ఇవ్వాలని, గతేడాది రూ.411 ఉండగా, ఇప్పుడు రూ.220కి పడిపోయిందని, తక్కువ గ్రేడ్ పొగాకు ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు బోర్డులో ఖాళీగా ఉన్న ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయాలని, ఒక్క ఎకరానికి రూ.3 లక్షల ఖర్చు అవుతున్నందున కనీసం కిలోకు రూ.350/- మద్దతు ధర చెల్లించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు విన్నవించారు. ప్రస్తుత ఏడాదికి అనుమతించిన మేరకే రైతుల సాగు చేయాలని, వచ్చే ఏడాది నుంచి పెంపు విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలత వ్యక్తం చేశారు. కాలం గుణంగా వచ్చే మార్పుల హెచ్చుతగ్గులను పరిగణలోకి తీసుకుంటూ 10 శాతం పెంపునకు ఉన్న అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రైతులకు భరోసా ఇచ్చారు.