జ్ఞాన జ్యోతి( ఎఫ్. యల్. యన్)శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి
1 min read
మండల విద్యాధికారి వెంకటేశ్వర నాయిక్
పల్లెవెలుగు ప్యాపిలి: స్థానిక ప్యాపిలి బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సరళ అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి (ఎఫ్.ఎల్.యన్) పేరుతో మండలంలోని అందరు అంగన్వాడి టీచర్లకు శిక్షణా కార్యక్రమం ప్రారంభించండం జరిగిందని మండల విద్యాధికారి వెంకటేష్ నాయక్ తెలిపారు. ప్రాథమిక స్థాయిలో భాష నైపుణ్యాలు మరియు గణితంలో పునాది అభ్యసన సామర్ధ్యాలను ఎలా సాధించాలో అంగన్వాడీ టీచర్లకు ఈ శిక్షణ కార్యక్రమంలో శిక్షణ ఇవ్వబడుతుంది.3-6 సంవత్సరాల పిల్లలకు కృత్యాధార పద్ధతిలో బోధించడం వల్ల పిల్లల్లో శారీరకఅభివృద్ధి, సామాజిక భావోద్వేగ అభివృద్ధి,భాషాభివృద్ధి, మేదోభివృద్ధి, సౌoదర్యాత్మక సాంస్కృతిక అభివృద్ధి జరిగి విద్యార్థులలో సంపూర్ణ మూర్తిమత్వం వృద్ధి చెంది 1వ తరగతికి సంసిద్దులుగా తయారు చేయడం ముఖ్య ఉద్దేశ్యం గా జరిగే ఈ శిక్షణలో అంగన్వాడీ కార్యకర్తలకు బోధనలలో నూతన బోధనా పద్ధతుల పై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణలో డీఆర్పీలుగా చిన్నపరెడ్డి,నరసింహారెడ్డి,మల్లేష్ లు మరియు అంగన్ వాడీ సూపర్ వైజర్ లు శకుంతల మరియు దేవకృప లు గా వ్యవహరిస్తున్నారని యం ఈ ఓ తెలిపారు.మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.