మేగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి..
1 min readపల్లెవెలుగు, వెబ్ గోనెగండ్ల: ఈనెల 12వ తారీకున జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని కేసుల్లో పరస్పరం రాజీ అయ్యి ప్రశాంతంగా ఉండాలని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ సిఐ మంజునాథ్ లు అన్నారు. శనివారం మండల కేంద్రమైన గోనెగండ్ల లోని స్థానిక పోలీస్ స్టేషన్లో కేసుల రాజుకి సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కారణాలతో గొడవలు పడి పరస్పరం కేసులు పెట్టుకున్న వారు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు కు గురికాకుండా జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజి అయ్యి సమస్యలను పరిష్కరించుకొని సత్వర పరిష్కారం పొంది కుటుంబాలతో సంతోషంగా గడపాలని అన్నారు. ఆదోని డివిజన్ డిఎస్పి పరిధిలో ఈనెల 1వ తారీకు నుండి ఇప్పటివరకు 663 గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో 44 కేసులను పరిష్కరించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్ఐ తిమ్మారెడ్డి ఏ ఎస్ ఐ వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.