PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేసవి శిక్షణను సద్వినియోగం చేసుకోండి: ఎంఎన్​వీ రాజు

1 min read

గడివేములు: నంద్యాల జిల్లా గడివేముల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల మైదానం లో ఆదివారం ఉదయం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా నంద్యాల జిల్లా క్రీడాభివృద్ది అధికారి  శ్రీ MNV రాజు గారు SAAP కోఆర్డినేటర్ రవికుమార్ గడివేముల వైస్ సర్పంచ్ బాలచెన్ని తైక్వండో చీఫ్ కోచ్ NIS       జి.షబ్బీర్ హుస్సేన్ క్యాంప్ ఇంచార్జ్ సలమాన్ భాష సీనియర్ క్రీడాకారులు షేక్ అలీ భాష  వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణ పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.  కార్యక్రమాన్ని ఉద్దేశించి నంద్యాల ఇంచార్జ్ MNV రాజు గారు మాట్లాడుతూ SAAP ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణాశిబిరాలు క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గౌరవ క్రీడా శాఖామంత్రి శ్రీమతి ఆర్ కే రోజా గారు ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారు V.C M D ప్రభాకర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గ్రామీణ క్రీడాకారులను వెలికితీయటానికి వేసవి శిక్షణాశిబిరాలు ఏర్పాటు చేశారు అని భవిష్యత్ లో ప్రతీ గ్రామంలో క్రీడా క్లబ్ లు తయారు చేస్తామని క్రీడల పట్ల ఆసక్తికరంగా గ్రామీణ ప్రాంతాల్లో క్లబ్ ల ద్వారా వసతుల కల్పన జరుగుతుందని తెలిపారు….అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తైక్వండో అనేది స్వీయ రక్షణ క్రీడ దీని వల్ల పిల్లల్లో మనోవికాసం శారీరక దృఢంగా ఉంటారని తెలిపారు. ఈ శిక్షణ శిబిరం లో దాదాపు 35 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని మే నెల 30 వ తేదీ వరకు కొనసాగుతుందని ఇంకా ఆసక్తి గల వారు రావచ్చు అని ఎటువంటి రుసుము వసూలు చేయడం  లేదని క్యాంప్ ఇంచార్జ్ సాలమాన్ భాష తెలిపారు.

About Author