ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
1 min readజిల్లా స్కిల్ అభివృద్ధి అధికారి హరికృష్ణ ,ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శివశంకర్
పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉచితంగా మహిళలకు టైలరింగ్,యువతి యువకులకు జూనియర్ సాఫ్ట్ వేర్ డెవలపర్ కోర్సులు ప్రారంభించినట్లు జిల్లా స్కిల్ అభివృద్ధి అధికారి హరికృష్ణ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శివశంకర తెలిపారు.మహిళలకు ,యువతీ యువకులకు అర్దికాభివ్రుద్దిని పెంపొందించేందుకు ఎపి స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న ఈఅవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. మొదట విడతగా జిల్లా వ్యాప్తంగా 12 కోర్సులు పూర్తిచేసినట్లు వారు తెలిపారు.శిక్షణ పూర్తి చేసుకొన్న వారికి పలు కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా రెండవ విడత గా జిల్లా వ్యాప్తంగా 12 కోర్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతీ యువకులు మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని అన్నమయ్య జిల్లా స్కిల్ అభివృద్ధి అధికారి హరికృష్ణ,ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ శివ శంకర్ లు పిలుపునిచ్చారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ద్వారా జిల్లలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందించే విదంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొన్న నిర్బయాన్ని బట్టి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఉచితంగా స్కిల్ హబ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నమయ్య జిల్లా స్కిల్ అభివృద్ధి అధికారి హరికృష్ణ తెలిపారు . ఈ సందర్బగా టైలరింగ్ టీచర్ మౌనిక మాట్లాడుతు స్త్రీ ఆర్థికంగా నిలబడినప్పుడే మన కుటుంబం మన పిల్లల భవిషత్ బాగుటుంది అందుకే ఇక్కడ ఇచ్చే శిక్షణ పూర్థిగా ఉపయెగించుకొని ఆర్థికంగా బలపడిబంగారు బాట వేసుకొవాలని సూసించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కడప రోడ్డు మార్గంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ నందు స్కిల్ హబ్ ద్వారా మహిళలలకు ఉచిత కుట్టు శిక్షణ తో పాటు జూనియర్ సాఫ్ట్ వేర్ డెవలపర్ కోర్సుల పై ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది .ట్రైనర్ల ద్వారా యువత యువకులకు ఈ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది . ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ శివ శంకర్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ అధికారి హరికృష్ణ వారి శిక్షణ కోర్సులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వారికీ కావాల్సిన సలహాలు సూచనలు అందజేస్తారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతు జూనియర్ సాఫ్ట్ వేర్ డెవలపర్ కోర్సు మూడు నెలలు శిక్షణ అనంతరం విల్లందరికి ఎగ్జాం నిర్వహించి జాతీయ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ వారు ఏర్పాటు చేసేటువంటి సర్టిఫికెట్స్ అందజేసి వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేశామన్నారు .అలాగే మహిళలకు కుడా ఉచితంగా టైలరింగ్ లో శిక్షణ పొండుతునా వారికీ శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిసన్లు అందించేలా ఏర్పాటు చేసి వారి అర్దికాభివ్రుద్దికి సహకారం అందజేస్తామన్నారు .జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాలలో మొదట విడతగా ఒక్కొక నియోజకవర్గం లో రెండు కోర్సులను ఏర్పాటు చేసి జిల్లో 12 కోర్సులను పూర్తీ చేయడం జరిగిందన్నారు .రెండవ విడత కుడా జిల్లా వ్యాప్తంగా కుడా 12 కోర్సులను ప్రారంబించి ఉచితంగా ట్రైనర్ల ద్వారా శిక్షణలను కల్పిస్తున్నామన్నారు .ఇలాంటి అవకాశాలు జిల్లా వ్యాతంగా వున్నటు వంటి నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని వారి కోరారు .ఉచితంగా శిక్షణ ఇస్తూ మమ్మల్ని ఆర్ధికంగా అభివృద్దిని పెంపొందించేందుకు కృషి చేస్తున్న రాష్ట్రా ప్రభుత్వానికి ,మాకు వెన్నంటు వుంటూ సలహాలు సూచనలు అందిస్తూన్నటువంటి అన్నమయ్య జిల్లా స్కిల్ అభివృద్ధి అధికారి హరికృష్ణ,ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ శివ శంకర్ లకు ప్రత్యెక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న యువతీ యువకులు మహిళలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.