ఆదరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
1 min read
ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు
చెన్నూరు, న్యూస్ నేడు: మండలములోని ఆదరణ(పనిముట్లకు) సంబంధించి కులవృత్తుల వారికి,కళాకారులకు, ఆదరణ పథకం కింద ప్రభుత్వం పనిముట్లను అందజేయడం జరుగుతుందని వీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు తెలిపారు. గురువారం ఆయన ఎంపీడీవో సభా భవనం నందు , బి సి కార్పొరేషన్ ద్వారా ఆదరణ పథకం పేస్ 3 ద్వారా ప్రజలకు, కళాకారులకు, కులవృత్తులవారికి , “కులసంఘాలకు గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు సమావేశం ఏర్పాటు చేసి పనిముట్ల పైఅవగాహన కల్పించారు. ప్రభుత్వం కులవృత్తులు, కళాకారులు, కుల సంఘాలకు ఎంతో చేయూత ఇవ్వడం జరుగుతున్నదని ఆదరణ పథకం ద్వారా ఏ ఏ వృత్తుల వారికి ఎలాంటి పనిముట్లు అందజేయాలి తద్వారా వారికి ఆ పనిముట్ల ద్వారా ఎంతవరకు అవసరం ఉంటుంది. ఈ పనిముట్ల ద్వారా ఏ ఏ పనులు చేపట్ట వచ్చునో వీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ఆయన తెలియజేశారు. పనిముట్ల విషయంలో వాటి వాడుక విషయంలో మాకంటే మీకే ఎక్కువ తెలుసని వీటి కొనుగోలుకు ఎంత ఖర్చవుతుందో కూడా మీకు తెలుసని అయితే ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కుల వృత్తులు చేసుకునే ప్రతి ఒక్కరికి అందుబాటులో విధంగా ఈ పనిముట్లను అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ ఓపిఆర్డి సురేష్ బాబు, ప్రజలు వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.