కళ్ళను సంరక్షించుకోవాలి! కంటి వైద్య నిపుణులు హనుమంత రెడ్డి
1 min read
పల్లెవెలుగు, పత్తికొండ : చిన్నతనం నుండి పిల్లలు కళ్ళను సంరక్షించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ కంటి వైద్యులు హనుమంత రెడ్డి సూచించారు. మంగళవారం పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ అంధత్వ నివారణ సంఘం ఆధ్వర్యంలో ” దృష్టిలోపం ఉన్న 27 మంది బాలికలకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.” స్కూల్ ఐ ప్రోగ్రాం” కింద గత సంవత్సరము అక్టోబర్ నెలలో పాఠశాలలో చదువుతున్న బాలికలందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో దృష్టిలోపం ఉన్న 27 మంది బాలికల గుర్తించడం జరిగింది .ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ హనుమంత రెడ్డి మాట్లాడుతూ, మన కళ్ళను సంరక్షించుకోవాలిసిన బాధ్యత మన మీద ఉందన్నారు .బాల్యంలో నుంచి మన కళ్ల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మనం తినే ఆహారంలో సరియైన పోషక విలువలు కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే దృష్టిలోపాన్ని నివారించవచ్చు అని అన్నారు. తర్వాత ఎక్కువగా టీవీలు చూడడము, మొబైల్స్ చూడడం వలన కూడా దృష్టిలోపం కలగడానికి అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు. అదే విధంగా వంశపారంపర్యంగా కూడా దృష్టిలోపం వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాబట్టి మన కళ్ళను మనమే సంరక్షించుకోవాలి అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.