కమిషనర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: కృష్ణాజిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ 20 వార్డులలోప్రతిరోజు సేకరిస్తున్న తడి చెత్తను, పొడి చెత్తను, వేరుచేసి గుంటూరులోని( వేస్ట్ మేనేజ్మెంట్ )జిందాల్ ప్లాంట్ కు తరలించాల్సి ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మున్సిపాలిటీలలోని చెత్తను తగలబెట్టకుండా చెత్తను వేరుచేసి ఆ చెత్త నుండి సంపదను తయారుచేసి క్రమంలో ఆ చెత్తను జిందాల్ ప్లాంట్ కుతరలించకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను విరుద్ధంగా ఉయ్యూరు నగర పంచాయతీలో 20 వార్డుల్లోని చెత్తను నాగన్న గూడెంలో వెళ్లే చెరువుగట్లపై వేసి తగలపెట్టిస్తున్న ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ పి. వెంకటేశ్వరరావు పై తగు చర్యలు కొరకు కృష్ణాజిల్లా కలెక్టర్కి స్పందనలో సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ విన్నవించడం జరిగిందని ఒక ప్రకటనలో తెలియజేశారు.