విద్యుత్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోండి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/9-9.jpg?fit=550%2C309&ssl=1)
పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో విద్యుత్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని నంద్యాల విద్యుత్ శాఖ ఏడి సుబ్రహ్మణ్యం స్థానిక ఏ ఈ ప్రభాకర్ రెడ్డిని ఆదేశించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలని ఏఈకి సూచించారు. ఉత్సవాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండి భక్తులకు అసౌకర్యం కలగకుండా విద్యుత్ కు అంతరాయం లేకుండా చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అదనపు ట్రాన్స్ఫార్మర్లతోపాటు విద్యుత్ స్తంభాలు వైర్లు ఇతర అవసరమైన సామాగ్రి అవసరమైతే తెలియజేయాలని అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏ ఈ ప్రభాకర్ రెడ్డి కి సూచించారు.